HEATU VAADAM Vs HATE-VAADAM

Editor · New Arrivals

HEATU VAADAM Vs HATE-VAADAM book cover

Price: Rs. 160. భారతదేశంలో ఐదారు ముఖ్యమైన మతాలున్నాయి. వీటిలో అదేమిటో కేవలం హిందూ మతమే ప్రమాదంలో ఉంది. అని చెపుతూ ఉందొక రాజకీయ పార్టీ. మిగతా మతాలకు జడ్ ప్లస్ రక్షణ ఉందా? ఉంటే.. ఎవరిచ్చారు? 'హిందువులారా మేల్కొనండి!'- అని కొందరు పిలుపునిస్తుంటే నవ్వొస్తుంది. అసలైతే హిందువులను, ముస్లింలను మేల్కొలిపే పనిలేదు. ఆ మాట కొస్తే, దేశంలో ఏ మతస్థుల్నీ మేల్కొల్పాల్సిన పని లేదు. అందరూ కలిసి, 'మనం మనుషులం' అని గుర్తించుకుని, మానవత్వాన్ని మేల్కొల్పాల్సి ఉంది. ఇది ఏ ఒక్క దేశానికో కూడా పరిమితం కాదు. విశ్వవ్యాప్తంగా మానవాళి చేయాల్సిన పని అదే! ప్రపంచంలోనే తొలి భౌతికవాదులకు పుట్టినిల్లయిన మన భారతదేశం, ఈ రోజు మత ద్వేషంతో ఉడికిపోతోంది. వరుసగా గుజరాత్, మణిపూర్ మారణకాండలే ఉదాహరణలు. దేశంలోని సమకాలీన స్థితిగతులకు దర్పణమే ఈ పుస్తకం! కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్, కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు గారు గత ఆరు దశాబ్దాలుగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో 95 ప్రామాణిక గ్రంథాలను వెలువరించిన ఈ కవి, రచయిత ఐదు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. ఇటీవలి కాలంలో వైజ్ఞానిక స్పృహ, మా'నవ'వాదం ఇతివృత్తాలుగా వీరు రాస్తున్న వ్యాసాల్ని వరుసగా పలు ప్రచురణ సంస్థలు పుస్తక రూపంలో వెలువరిస్తూనే ఉన్నాయి. సమాజంలో మా'నవవాదాన్ని, హేతువాదాన్ని పెంచాలన్న ధ్యేయంతో నిరంతరం తపిస్తూ తన కలం కొరడా ఝుళిపిస్తున్న నిత్య కృషీవలుడు ఈ రచయిత! ఆ కోవలోనిదే ఈ రచన! అదే ఈ ప్రచురణ !!

Browse more Telugu books