Halla Bol
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 270. కళ కళ కోసం, కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం అన్న ప్రజా సాంస్కృతికోద్యమ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి, సమ సమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో వీధి నాటికను శక్తివంతమైన ఆయుధంగా మలిచిన ప్రజా కళాకారుడు సఫ్టర్ హష్మీ. ప్రజా ఉద్యమమే జీవితంగా గడిపిన సఫర్ హష్మీ 35వ ఏటనే హత్యగావించబడ్డాడు. నూతన సంవత్సరం రోజున ఢిల్లీలో అసంఘటిత కార్మికోద్యమానికి మద్దతుగా హల్లాబోల్ నాటిక ప్రదర్శిస్తుండగా ఆయనపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి హతమార్చారు. చిన్న వయసులోనే సాంస్కృతిక రంగంలో హష్మీ చేసిన కృషి, ఆయన జీవితం నేటికీ సామాజిక అభ్యుదయాన్ని కాంక్షించే వారందరికీ ఒక ప్రేరణ. ఒక పాఠం, ఒక దారి దీపంగా నిలుస్తుంది.