Guru Ravidas
Editor · History

Price: Rs. 90. ఉత్తర భారతదేశంలో సంత్ పరంపరలో అగ్రగణ్యుడు గురు రవిదాస్. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ తన నిర్గుణవాద తత్వాలతో మానవ శ్రమకు, దయకు, మానవత్వానికి పెద్దపీట వేసి భక్తిని మానవ విముక్తికి ఆయుధంగా మార్చి ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించాడు. సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమైన తాత్వికతను బలహీన వర్గాలకు అందించి ఆధ్యాత్మికంగా వారిని ఉన్నత స్థితికి ఎదిగేలా చేసిన గొప్ప సంస్కరణవాది రవిదాస్. సామాజిక అణచివేత, అంటరానితనం వంటి అమానుష ఆచారాలపై సంత్ రవిదాస్ తన తత్వాలను ఎక్కుపెట్టి అంటరాని కులాల దేవుడుగా పూజలందుకున్నాడు... నేటికీ అందుకుంటున్నాడు. దళిత చైతన్యాన్ని రేకెత్తించడంలో ప్రచారం చేయడంలో రవిదాస్ తత్వాలు కీర్తనలు శతాబ్దాలుగా నేటికీ సమాజంపై ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయి. స్పిరిట్యువల్ ఛాంపియన్ ఆఫ్ దళిత్గా నేటి మేధోలోకం సంత్ రవిదాస్ని కీర్తిస్తుంది. అటువంటి మహాపురుషుని జీవితం సచిత్రంగా మీ కోసం.....