GULAMGIRI

Editor · New Arrivals

GULAMGIRI book cover

Price: Rs. 75. భారతదేశపు సామాజిక విప్లవ ఆలోచనలకు ఆద్యుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫులె 1873 లో రాసిన గ్రంథం ఇది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు. భారతదేశంలోని కులవ్యవస్థ నిర్మించిన బానిసత్వాన్ని కళ్ళారా చూసి, అనుభవించి, ఎదుర్కొని పోరాడిన ఫులె విశ్లేషణలు ఎంతో విలువైనవి. ఈ దేశంలోని అశేష ప్రజానీకాన్ని బానిసత్వంలోకి నెట్టిన బ్రాహ్మణవాదపు ఆలోచన, ఆచరణ సమాజానికి ఎంత నష్టం చేసిందో విపులంగా చర్చించారు. భౌతికంగా బ్రాహ్మణేతరులను -శూద్రులను హీనంగా చూడటమే కాక, మానసికంగానూ శూద్రులు, అతిశూద్రులు తమకుతాము బలహీనులమని భావించుకునే స్థితి ఏర్పరచటంలోని విషయాలను స్పష్టంగా వివరిస్తారు ఈ పుస్తకంలో.

Browse more Telugu books