Gudise Eesobu
Editor · Books

Price: Rs. 45. నేటి దళిత క్రైస్తవుడు క్రైస్తవ మత సహాయాన్ని విద్య, వైద్య రంగాల్లో పొందలేకపోవడం, వారిలోని అసంతృప్తి, బాధ, వ్యధలను “గుడిసె ఏసోబు” కథల్లో ప్రత్యక్షర దృశ్యంగా ఈ రచయిత కనులకు కట్టించాడు. - డా॥ కత్తి పద్మారావు ఇవి కేవలం దళిత క్రైస్తవుల కథలు కావు. అభివృద్ధి అందిపుచ్చుకున్నవాడికి, అందుకోవాల్సిన వాడికి మధ్య చెలరేగే సామాజిక విప్లవ పోరాట కథలివి. - బి.ఎస్. రాములు దారాగోపి వెంకటేశు ఏసోబుగా మారితే వెంకట్రెడ్డి జోసెఫ్డ్డిగాను, వెంకయ్య చౌదరి జోసెఫ్ చౌదరిగాను... పేర్లే మారుతున్నాయి తప్ప కుల వ్యవస్థ నశించలేదు. అణచివేసే వర్గాల దేవుడు దళితుల దేవుడు ఎలా అవుతాడు? ప్రాథమికంగా దళిత క్రైస్తవ తత్వశాస్త్రం వేసిన ఈ ప్రశ్న భారతీయ దళిత క్రైస్తవ విముక్తి తత్వశాస్త్ర (లిబరేషన్ థియాలజీ) రూపకల్పనకి నాంది పలికింది. అందుకే ఈ కథలు దళిత క్రైస్తవ జీవిత గాథలు అయ్యాయి. - బి. ఎం. లీలాకుమారి