Gowthama Buddudu

Editor · History

Gowthama Buddudu book cover

Price: Rs. 315. బుద్ధపథగామి శ్రీ డి. నటరాజారు రాసిన రచనలలో “మరపురానిపాప” తరువాత విశేష ప్రాచుర్యం పొందిన రచన ఈ "గౌతమబుద్ధుడు". ఈ రచన చేయడానికి ఆయన ఎంతో పరిశ్రమించారు. 1996లో ఈ గ్రంథాన్ని ప్రచురించడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డారు. అయితే ఆయన కృషికిమేలైన ప్రశంసలే లభించాయి. బుద్ధధర్మం విషయంలో మేలైన, నిత్యం చదవగలిగిన పుస్తకం యీ "గౌతమబుద్ధుడు" రచన పేరు పొందింది. ఎంతోమంది ఆలోచనలను మలుపు త్రిప్పింది.. “శ్రీ నటరాజ్, బుద్ధుని జీవితాన్ని యీ గ్రంథంలో "ఎక్స్టెంట్ అండ్ ఎట్రాక్టివ్ వే"లో చిత్రీకరించారనీ, బుద్ధుని విశ్వజనీనమైన ధర్మాన్ని, వర్తమానంలో బుద్దదర్మం యొక్క అవసరాన్నీ చాలా బాగా వ్యక్తీకరించారనీ మహాతాత్త్వికులు ఆచార్య క్రొత్త సచ్చిదానందమూర్తి గారు కొనియాడగా, 'ఇదొక అపురూప రచన కమనీయమైన, ప్రౌఢమైన రచన అన్నారు. ఆచార్య శ్రీ సంజీవదేవ్. ఇంక యీ రచనకు గాను మేధావుల నుంచి వచ్చిన మెచ్చుకోళ్ళు, పాఠకుల నుంచి వచ్చిన వుత్తరాలు, ఫోన్లు ఎన్నో. ఈ గ్రంథం చదివి ప్రభావితులైన వారెంతమందో, ఎంతోమందిని బుద్ధధర్మానికి ఆకర్షితులయ్యేటట్టు చేసిందీ పుస్తకం. తెలుగునాట బుద్ధ ధర్మ సాంస్కృతిక ఉద్యమంలో యీ గ్రంథం ఒక అందమైన ప్రధానమైన ఘటనగా మలుపుగా చెప్పుకోవచ్చు.

Browse more Telugu books