Good Student
Editor · Education & Science

Price: Rs. 85. ఈరోజు సమయాన్ని రేపటికి దాచుకోలేం. ఏ రోజు సమయమంతా ఆరోజే ఖర్చు పెట్టేయాలి. అది సక్రమంగా ఖర్చుపెడితే లాభం లేదా అంతా నష్టమే. విద్యార్థులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. పరీక్షలంటే భయం పోగొట్టడానికి, ప్రణాళికాబద్ధంగా చదువు కోవడానికి, చదువుతోపాటు విద్యార్థులు ఏ విషయాలు నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. డా॥ బి.వి.పట్టాభిరామ్ రచయితగా, వ్యక్తిత్వ వికాస నిపుణునిగా మీ అందరికీ సుపరిచితులు. తన ప్రదర్శనలతో ప్రపంచం నలుమూలలా అభిమానులను సంపాదించుకున్న పట్టాభిరామ్ రచనలు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకోసం ఆయన రచించిన 'జీనియస్ మీరు కూడా', "కష్టపడి చదవొద్దు - ఇష్టపడి చదవండి' పుస్తకాలు ప్రచురణ రంగంలో సంచలనం సృష్టించి లక్షలాదిమందికి మార్గదర్శకం అయ్యాయి. తెలుగు, కన్నడ భాషల్లో అత్యధిక పాఠకాదరణ కలిగిన రచయితగా సంచలనం సృష్టిస్తోన్న డా॥ బి.వి.పట్టాభిరామ్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతోపాటు, డా॥ బి.వి.పట్టాభిరామ్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం 'మట్టిలో మాణిక్యాలు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.