Good Parent
Editor · Personality Development

Price: Rs. 85. మీ పిల్లలకు గొప్ప కలలు ఎలా కనాలో నేర్పండి. గొప్ప లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి. వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. ప్రేమించండి. నిర్దేశించవద్దు. స్నేహితులుగా సలహాలు ఇవ్వండి. భయపెట్టవద్దు. భయాన్ని పోగొట్టంది. చదువు బాగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చదువుతున్నారు అనేదానికన్నా, ఎంత బాగా చదువుతున్నారు. ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యమని గ్రహించండి. మంచి మార్కులు అవసరమే. మంచి మార్కులతోపాటు మంచి అలవాట్లు అవసరమనే విషయం తెలియజెప్పండి. డా|| బి.వి.పట్టాభిరామ్ రచయితగా, వ్యక్తిత్వ వికాస నిపుణునిగా మీ అందరికీ సుపరిచితులు. తన ప్రదర్శనలతో ప్రపంచం నలు మూలలా అభిమానులను సంపాదించుకున్న పట్టాభిరామ్ రచనలు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో అత్యధిక పాఠకాదరణ కలిగిన రచయితగా సంచలనం సృష్టిస్తోన్న డా॥ బి.వి.పట్టాభిరామ్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. డా॥ బి.వి.పట్టాభిరామ్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం 'మట్టిలో మాణిక్యాలు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.