Gombegoudara Ramanagouda
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 75. డా.చంద్రప్ప సొబటిగారు 1980లో బళ్ళారి జిల్లా, హగరిబొమ్మనహళ్ళి, కెచ్చినబండి గ్రామంలో జన్మించారు, తండ్రి శ్రీ నాగేంద్రప్ప సొబటి, తల్లి శ్రీమతి హనుమక్క సొబటి. ఎం.ఎ.(జానపదం) చేసిన తరువాత, 'డోలు పాటల సాంస్కృతిక అధ్యయనం' అనే విషయంపై పి.హెచ్.డి. అందుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక జానపద విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నారు. సాంస్కృతిక అధ్యయనం వీరికి ఆసక్తి కలిగిన రంగాలు. వీరి సాహిత్య కృషికి ఫలితంగా 9 కృతులు ప్రచురితమయ్యాయి. 30కి పైగా పరిశోధనా వ్యాసాలు, అనేక వార, మాస, త్రైమాసిక పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రస్థాయి, దేశస్థాయి పరిశోధనా చర్చలలో, వీరు జానపద రంగంలో చేసిన సేవలకుగాను ధారవాడ తాలూకా, మాసూరు శ్రీ రేవణ సిద్దేశ్వర విద్యాపీఠమూ 2017లో 'కనక గౌరవ పురస్కారం' అందుకున్నారు. '2019లో మాభివృద్ధి సంఘం(రి), కలుబుర్గి రాష్ట్రస్థాయి సగరనాడు సౌరభపురస్కారం' అందించి గౌరవించింది. రంగనాథ రామచంద్రరావు తెలుగు పాఠకులకు రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. రచయితగా అనేక పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 3 సొంత కథా సంపుటాలు, 8 అనువాద నవలలు, 14 అనువాద కథా సంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవన చరిత్ర, 2 సొంత నవలలు, సాహిత్య అకాడమి కోసం చేసిన 8 అనువాదాలు, బాలల కోసం 10 . పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. సాహిత్య అకాడమీ కోసం అనువదించిన పి. లంకేశ్ గారి 'రాళ్ళు కరిగిన వేళ'కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం అందుకున్నారు. సొంత కథల సంపుటి 'మళ్ళీ సూర్యోదయం' కథల సంపుటికి 'ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు. 'సమకాలీన కన్నడ దళిత కథల' సంకలనానికి 'శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం' అందుకున్నారు.