Gnanam Chekkina Shilpam

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Biographies & Auto Biographies

Gnanam Chekkina Shilpam book cover

Price: Rs. 135. పన్నెండేళ్ల వయసులో పగలు చదువుకుంటూ, రాత్రిళ్ళు సినిమా హాలు దగ్గర సోడాలూ, సిగరెట్లూ అమ్మేవాడిని. ఎనిమిదో తరగతి స్కూల్ ఫీజు కట్టలేక చదువు మానేసి హోటల్ లో పనికి చేరాను. టేబుల్స్ శుభ్రం చేయడం, గ్లాసులు కడగడం నా పనులు. మధ్యాహ్నం పూట ఆముదాల వలస రైల్వే స్టేషన్లో స్నానం చేసేవాడిని. ఇంద్రధనస్సు లాంటి అనుభవాలు నావి. మీసాలు రాని వయసులో గిరిజన తండా గుడిసెలో ఒక్కణ్ణి పడుకుంటూ, అడవి లో జలపాతం పక్కన డిస్టిలరీలో పని చేసేవాడిని. అటుగా వచ్చిన నక్సలైట్లకి టీ కాసి ఇచ్చేవాడిని. అప్పుడప్పుడు దొంగసారా లిక్కర్ మాఫియాతో గ్యాంగ్ వార్ లు జరిగేవి. ఆ తరువాత కొంతకాలం పాముకాటుకి పనిచేసే 'పాతాళ గరుడ' కాంట్రాక్టు తీసుకుని, మూలిక సేకరించే పనిలో అడవిలో క్రూరమృగాలతో, కొండలపై తేళ్ళతో, వాగుల్లో జలగలతో సావాసం చేశాను. ప్రస్తుతం నాకు రూర్కెలాలో, భువనేశ్వర్ లో, తిరుపతిలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, హాస్పటల్స్ ఉన్నాయి. "రోగుల సొమ్ము వైపు చూడకండి వ్యాధిని చూడండి" అనేది మా నినాదం. గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు మా కాలేజీల్లో ఉచితంగా, లేదా కనీస ఫీజులతో బోధిస్తున్నాం. నేనింతవరకూ సిగరెట్టు ముట్టలేదు. పేకాట మందు లాంటి వ్యసనాలు లేవు. పని తప్ప నాకు మరొకటి తెలీదు. హోటల్లో టేబుల్స్ తుడిచే స్థాయి నుంచి ఈ స్థాయికి అంచెలంచెలుగా... నిజాయితీగా ఎలా ఎదిగానో యువతకి చెప్పటానికే ఈ పుస్తకం.

Browse more Telugu books