Gilgamesh Ithihasam

మందలపర్తి కిషోర్/ Mandalaparthi Kishore · Novels

Gilgamesh Ithihasam book cover

Price: Rs. 108. పర్షియా సింధు శాఖలో కలిసే రెండు పెద్ద నదులు టైగ్రిస్, యూఫ్రటిస్. ఈ రెండు నదుల మధ్య ఉండే సారవంతమైన ప్రాంతమే మెసపటేమియా. అది ఇప్పటి ఇరాక్, తూర్పు సిరియాలుండే ప్రాంతం. అత్యంత ప్రాచీన సంస్కృతులు విలసిల్లిన ప్రాంతాల్లో అదొకటి. సుమేర్, అక్కాడియా, బాబిలోనియా, అసిరియా, అబ్బాసీద్ నాగరికతలు విలసిల్లింది ఇక్కడే. అలాంటి మెసపటేమియాలో పుట్టిన పురాణ గాథే గిల్గమేషు ఇతిహాసం. దీనిని కొందరు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పురాగాథ అంటారు. 2010 నాటికి ఈ పురాణ గాథకు, 90 పాఠాలున్నాయి అని తేల్చారు. మొదటి పాఠం క్రీ. పూ, రెండు వేల ఐదొందల సంవత్సరాల క్రితం సుమేరియన్ భాషలో వెలుగు చూసింది అంటారు. వేల ఏళ్ల కిందట అరక్ రాజ్యాన్ని పాలించిన ఐదో రాజే ఈ గిల్గమేషు అంటారు. అతని గురించి ఐదు వీర గాథలు మొదట సుమేరియన్ భాషలోనే గేయ గాథలుగా వచ్చాయట. ఈ గాథనే అషుర్బనిపాల్ అనే రాజు 12 మట్టి పలకల మీద రాయించి భద్రపరిచాడు అంటారు. ఈ గేయ గాథనే సరళమైన తెలుగు వచన పురాణ కథనంగా మలచి మనకు అందించారు, రచయిత మందలపర్తి కిషోర్.

Browse more Telugu books