Gijubai Pagatikala, Valstreet muttadi

Editor · Cinima

Gijubai Pagatikala, Valstreet muttadi book cover

Price: Rs. 55. సులభమైన భాషలో యధార్థ విద్యాపరిస్థితులను విశ్లేషించడంలో గిజూభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే బాధలు ఆయన చూడలేక పోయారు. వారి బాధల నివారణకే ఆయన విద్యారంగంలో కొత్త కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు, వాటిని రచనల రూపంలో ఒక స్రవంతిగా ప్రవహింపజేశారు. ఆందోళనలు, సమ్మెలకు దూరంగా ఉండే అమెరికాలో వాల్ స్ట్రీట్ లాంటి ఉద్యమం రావటం ఏమిటి? అదీ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రమైన బాల్టి లక్ష్యంగా చేసుకొని, కార్పొరేట్ శక్తులకు ఎలాంటి రాయితీలు ఇవ్వరాదని ఉద్యమించటానికి దారితీసిన కారణాలేమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? కార్మికులు, 'ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వాములా? తెల్లవారు, నల్లవారు కలిసి పాల్గొంటున్నారా? ఇప్పుడున్న వ్యవస్థను సంపూర్ణంగా మార్చాలని కోరుతున్నారా లేక దానిని ఇలాగే కొనసాగిస్తూ కేవలం సంస్కరణలు మాత్రమే అమలు జరపాలని వాంఛిస్తున్నారా? ఇలాంటి పలు అంశాలను ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది.

Browse more Telugu books