Genius Meeru kuda

Dr. B.V. Pattabhiram · Personality Development

Genius Meeru kuda book cover

Price: Rs. 100. నాకు కాలేజీకి వెళ్ళే పిల్లలిద్దరున్నారు. వాళ్ళ హైస్కూలు చదువు పూర్తయి కాలేజీలో చేరినాక నాకు వాళ్ళతోటి పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఏర్పడింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్నేహాలు, కోపాలు, ద్వేషాలు, రాజీలు, రహస్యాలు... ఇలా అన్నిటికి నేను మౌనసాక్షిని. నాకు వాళ్ళను చూస్తుంటే చాలా రద్దీగా వున్న నాలుగురోడ్ల కూడలిని దాటడానికి ప్రయత్నిస్తున్న చిన్న పిల్లల్ని చూస్తున్న భావన కలుగుతుంటుంది. వాళ్ళందర్ని నా చేతులమీద, భుజాలమీద మోసుకుని ఆ రోడ్డు దాటించాలనిపిస్తుంది. వాళ్ళ వేగం నాకు భయంకొల్పుతుంది. వాళ్ళ భయాలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. వాళ్ళ ఆశలు, ఆశయాలు ఈ పోటీ ప్రపంచపు వత్తిడులమధ్య ఎలా నెరవేరుతాయా అన్న ప్రశ్న నాకు కొన్ని నిద్రలేని రాత్రులను ప్రసాదించింది. వాళ్ళకోసం కాలేజికి వెళితే క్రమశిక్షణ అనే అందమైన పదంమాటున వాళ్ళను కట్టిపడేసే ఇనుపచట్రాలు నాకు భీతికొల్పేవిగా ఉన్నాయి. వారానికి రెండు పరీక్షలు, ప్రతి పరీక్షలో ర్యాంకులు, ఒక్కమార్కుతో తప్పిపోయిన చప్పట్లు, తరువాత తల్లిదండ్రుల తిట్లు, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు పడే అగచాట్లు ఇదంతా ఓ వలయం, ఓ చక్రబంధం. వీటన్నిటికి గత రెండేళ్ళుగా నేను ప్రత్యక్షసాక్షిని. ఇక ప్రస్తుత విషయానికొస్తే నా పిల్లలు శ్రీ పట్టాభిరామ్ను తరచు కలుస్తుంటారు. వాళ్ళతో ఆయన వాళ్ళ భాషలో ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. వీటినే నేను గత కొన్నేళ్ళుగా చూస్తూనే వున్నాను. జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులకు శ్రీ పట్టాభిరామ్ మాట్లాడే విషయాలు ఎంతో అవసరమనిపించింది.

Browse more Telugu books