Gen Z Bharatam
Editor · Politics

Price: Rs. 100. ఒక ఉద్యమం ఎక్కడ మొదలైందన్నది దాని రాజకీయ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో ముందే నిర్ణయించదు. పరీక్షలో న్యాయం కావాలనే డిమాండ్ సంస్థల జవాబుదారీతనం వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఉపాధి ప్రశ్నకు వెళ్లవచ్చు. ఉపాధి నుంచి అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు కురిపించవచ్చు. "మేమెంతో మాకంత" అని నినదించవచ్చు. దొంగ ఓట్ల నుండి ఓట్ల దొంగల వరకు “వెలిగిపోతున్న” మొత్తం పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థనే నిలదీయవచ్చు. ఇవన్నీ ఇప్పుడున్న ఫాసిస్టు పరిస్థితులలో విప్లవాత్మకంగా కనిపించవచ్చు. కాని, ఇవన్నీ కూడా ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగమే. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోనే చెయ్యగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొనసాగుతున్న ఉద్యమాన్ని రొమాంటిసైజ్ చేయకుండా దానిలోని రాజకీయ అవకాశాన్ని చూడగలగాలి. కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలను నిలువరించడంలో జెన్ జీ ఎలాంటి రాజకీయ శక్తిగా మారగలదో చూడాల్సి ఉంది. భారతీయ సమాజాన్ని భయానంతర రాజకీయ స్థితివైపు నడిపించే సామర్థ్యం ఈ తరానికి ఉందన్న నమ్మకాన్ని ఇప్పటికే కలిగించింది. ఈ ఉద్యమానికి ఎన్ని పరిమితులైనా ఉండవచ్చు. ఊపిరాడనట్లున్న నేటి రాజకీయ వాతావరణంలో జెన్ జీ కొత్త రాజకీయ ఆకాంక్షలకు, అవకాశాలకు అవసరమైన స్థలాన్ని తెరవగలదనే ఆశ కలుగుతోంది. ఈ ఉద్యమ చారిత్రక నేపథ్యాన్ని, ప్రస్తుత పరిణామాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి క్రాంతి రాసిన జెన్ జీ భారతం ఉపయోగపడుతుంది. - అశోక్ కుంబము