Gatitarka Tatva Darshana Bhoomika / గతితర్క తత్వదర్శన భూమిక
B. S. RAMULU / బి. ఎస్. రాములు · Books

Price: Rs. 540. బి. ఎస్. రాములు గారు జగిత్యాలలో 1949 ఆగష్టు 23న బేతి లక్ష్మీరాజు, మట్టపెల్లి నారాయణ దంపతులకు జన్మించారు. సామాజిక తత్వవేత్తగా రచయితగా సుప్రసిద్ధులు. వీరిది చేనేత వృత్తి కుటుంబం. తండ్రి బట్టలమిల్లు కార్మికుడు. తండ్రి 1966లో అకాల మరణం, తల్లి బీడీలు చేసి పెంచి పోషించింది. బి.ఎస్. రాములు బీడీ కార్మికుడుగా, పేపర్ బోయ్ గా, పేవర్ ఏజెంట్, ఆర్.ఎస్.ఎస్ ముఖ్య శిక్షణ, ఉద్యోగ సంఘాల నాయకుడిగా, విప్లవ రచయితగా, విప్లవకారుడిగా, సంఘ సంస్కర్తగా సంస్కర్తగా, కథకుడిగా, నవలాకారుడిగా, సామాజిక ఉ ద్యమకారుడిగా, సామాజిక తత్వవేత్తగా అనేక దశలు దశలుగా వీరి జీవితం సాగింది. 1973లో శ్యామలతో పెళ్లి, పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ లో నివాసం, ఇలా వైవిధ్యపూరితమైన అనుభవాలు, అవమానాలు, సత్కారాలు, అనేక అధ్యయనాలు, అభివృద్ధి వీరి జీవితంలో భాగమయ్యాయి. ఈ అనుభవాలు, అధ్యయనాలతో జీవితం గురించి ఎలా ఆలోచించాలో, జీవితంలో ఎలా ఎదగాలో మార్గదర్శనం చేస్తూ 'గతితతర్క తత్వదర్శన భూమిక', 'గతితర్కం అంబేద్కరిజం మార్చిజం', 'బౌద్ధం సోసలిజం', 'బహుజనతత్వం', 'సమగ్ర వ్యక్తిత్వ వికాసం', 'జీవితం అంటే ఏమిటి', 'వ్యక్తిత్వ నిర్మాణం', 'లీడర్షిప్', 'సామాజిక న్యాయం అంటే ఏమిటి?' తదితర గ్రంథాలు వెలువరించారు. 1990 నుండి ఉమ్మడి రాష్ట్రంలోని రచయితలను, కళాకారులను, మేధావులను ఒక వేదికపైకి తీసుకువచ్చే కృషి చేస్తూ 1992 నుండి దరకమే ఐక్యవేదిక వ్యవస్థాపక కన్వీనర్‌గా, అధ్యక్షుడుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వందలాది ప్రసంగాలు చేశారు. అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, సమస్థ రంగాల్లో ఎదగడానికి అనేక చర్చలు చేశారు. సిద్ధాంత ప్రాతిపదికలు ఏర్పరిచారు. వ్యక్తిత్వ నిర్మాణ గ్రంథాలు వెలువరించారు. తత్వశాస్త్రంలో, తర్కశాస్త్రంలో, జ్ఞాన శాస్త్రంలో నూతన వెలుగులు ప్రసరింపజేశారు. వీరిది వినూత్నపథం, నూతన చరిత్ర నిర్మాణంలో క్రియాశీల పాత్ర, సమస్థ, వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష వివక్షతలను, అసమానతలను నిర్మూలించడం వీరి జీ