Gassal

కటుకోజ్వల ఆనందాచారి / Katukojwala Anandachari · Books

Gassal book cover

Price: Rs. 117. వస్తువు ఎంపిక, కథా నిర్వహణ, ముగింపు ఇవి రచయిత శక్తి సామర్ధ్యాలనూ, రచయిత సామాజిక, రాజకీయ అభిప్రాయాలను తెలియజేస్తాయి. కథా వస్తువుని ఎంచుకోవటం తేలిక కాదు. మన కళ్ళముందు నడుస్తున్న జీవితాలు, వాటిలో మార్పులు అందరూ చూస్తారు. ఆలోచిస్తారు. ఆ అనేకానేక సంఘటనల నుంచి ఒక కొత్త వస్తువును ఎంచుకోవటంలో రచయిత ప్రతిభ కనపడుతుంది. ఆ ప్రతిభ ఆనందాచారికి పుష్కలంగా ఉందని ఈ సంపుటిలోని చాలా కథలు మనకు చెబుతాయి. - ఓల్గా కథలన్నీ చదివాక ఆనందచారి గారు ఆశామాషీగా కథలు రాయరని తెలిసిపోతుంది. ఏ కథ రాసినా దాని గురించి లోతైన అధ్యయనం కావలసినంత సమాచారం సేకరించాకే కథని రాస్తాడని తెలుస్తుంది. కథను రాసే ప్రక్రియలో కూడా అతను ఎంచుకున్నటువంటి సాదాసీదా శైలి, కథలో చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పడం, పాత్రల వర్ణన, సందర్భానుసారంగా వాతావరణ వివరణ, అన్ని ఆచితూచి కొలిచి కథకు కావలసినంత మాత్రమే ఇస్తాడని అర్థమవుతుంది. ఇవి చదివి వదిలేయాల్సిన కథలు అసలే కాదు. పూర్తిగా అధ్యయనం చేయాల్సిన కథలు. - పెద్దింటి అశోక్ కుమార్ ఎన్నో ముస్లిం కుటుంబాలలో ఉన్న దారిద్ర్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది గస్సాల్ కథ. పుట్టుకతో అంటిపెట్టుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, భాషను హేళన చేస్తున్నవారిపై నిరసన బాణం 'లచ్చిమి' కథ. అలాగే ఎంచుకున్న వస్తువుకు సరిగ్గా నప్పేలా కథన రీతిని మలిచారు. ఓ. హెన్రీ కథల్లో కనిపించినట్లు ఉదాత్తమైన పాత్రలు ఈ కథల్లో మనకు దర్శనమిస్తాయి. ఈ పాత్రలన్నీ మనకు సుపరిచితమైన పాత్రల్లా, మనమూ వారితో కలిసి పయనిస్తున్నట్లుగా కనిపిస్తాయి. - నస్రీన్ ఖాన్

Browse more Telugu books