Gangu

వట్టికోట ఆళ్వారుస్వామి / Vattikota Alwaruswamy · Novels

Gangu book cover

Price: Rs. 195. తెలంగాణాలో కొనసాగిన ప్రతి ప్రజాఉద్యమంతోను ఆయనకు సంబంధం వుంది. నైజాం నిరంకుశ పాలననుంచి తెలంగాణాప్రజను విముక్తి చేసేందుకు కృషి సల్పిన ఆంధ్ర మహాసభ నాయకుల్లో వారొకరు. స్టేటు కాంగ్రెసు నడిపిన సత్యాగ్రహుద్యమంలో పాల్గొన్నారు. వెట్టిచాకిరీకి, నిర్బంధ లెవీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. కమ్యూనిస్టుపార్టీలో చేరి, అది నడిపిన ఉద్యమాలన్నిటిలోనూ పాల్గొని కారాగృహవాస మనుభవించారు. “హైదరాబాద్ లో స్టేట్ కాంగ్రెసు ఆధ్వర్యాన మొదటి సత్యాగ్రహ సమరము ప్రారంభమయ్యేవరకు తెలంగాణాలో ప్రజలకు, నిజాం అనుచరులైన నిరంకుశ పాలకులకు మధ్య జరిగిన సంఘర్షణను పూసగుచ్చినట్లు ఎంతో సానుభూతితో, మెచ్చుకో దగిన ప్రాంతీయ భాషా ప్రావీణ్యంతో చెప్పారు ఈ గ్రంథంలో శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారు. శ్రీ స్వామిగారు 1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించారు..... అది 33 గ్రంథాలను ప్రచురించింది. తెలంగాణాలో తెలుగు భాష యింతగా వ్యాప్తి చెందడానికి వారి దేశోద్ధారక గ్రంథమాల ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు.

Browse more Telugu books