Gandhiji hantakudu
Editor · Best Selling

Price: Rs. 280. గాంధీజీ హంతకుడు పుస్తకంలో రచయిత ధీరేంద్ర కె. ఝా అపారమైనసమాచారం, సాధికారిక ఆధారాల ద్వారా ఒక ఉన్మాది రాజకీయాలను, మానసిక ప్రవృత్తిని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా బట్టబయలు చేశారు. ప్రస్తుతవినాశకర పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి కావలసిన ఆధునిక భారతదేశపు రహస్య దుర్మార్గ చరిత్రను కూడ తేటతెల్లం చేశారు. - పంకజ్ మిశ్రా, రచయిత పుస్తకం మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన కుట్రను విపులంగావిశ్లేషించడానికే పరిమితం కాదు. నిజానికి ఇది 1940వ దశకంలో భారత రాజకీయ రంగంపై ఆరెస్సెస్ ఎలా ఆవరించి ఉన్నదో విశదీకరిస్తుంది. ఈ సంస్థ బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా పోరాడకపోయి ఉండవచ్చు. ఎన్నికల్లో పోటీచేసి ఉండకపోవచ్చు. సావర్కర్ నాయకత్వలోని మొట్టమొదటి హిందూత్వ పార్టీహిందూ మహాసభతో సన్నిహితంగా పెనవేసుకుని ఉన్నది. నాధురాం గాడ్సె సహవ్యవస్థాపకుడుగా ఉన్న హిందూ రాష్ట్ర దళ్ అనే సాయుధ సంస్థతో అవినాభావసంబంధం కొనసాగించింది. గాడ్సె ఎన్నడూ ఆరెస్సె సంబంధాన్నివదులుకోలేదని ఈ పుస్తక రచయిత విజయవంతంగా నిరూపించారు. - క్రిస్టఫర్ జఫర్లా ట్ "ఈ పుస్తకం గాంధీజీ హత్యకు కుట్రను, దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలను హంతకుడి మానసిక ప్రవృత్తితో సహా సరళమైన రీతిలో,విశ్వసనీయంగా వివరించడం ఒక్కటే కాదు, ఆరెస్సెస్, హిందూ మహాసభ విస్తృత రాజకీయాలను, సావర్కర్ తో సహా దాని నాయకుల గురించి విపులంగాతెలియచేస్తుంది. అందుచేతనే ఇది ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ప్రాధాన్యత కలిగి,తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.' - మృదులా ముఖర్జీ, చరిత్రకారిణి