Gandhi-Antaranivari Vimukti Series 16

Editor · History

Gandhi-Antaranivari Vimukti Series 16 book cover

Price: Rs. 55. ప్రపంచ వ్యాప్తంగా... నిమ్నజాతుల వాళ్లు ఉన్నారు. వీళ్లను- ఆస్బర్న్ వార్డ్ తన పుస్తకం 'ది ఏన్సెంట్యానిషెంట్ లోలీ' (The Ancient Lowly)లో - లోలీ అని పిలుస్తాడు. రోమన్లకు బానిసలు ఉండగా, స్పార్టావాసులకు హెలాట్లు, ఆంగ్లేయులకు విలన్లు (వెట్టి చేసే కమతగాళ్లు), అమెరికన్లకు నీగ్రోలు, జర్మన్లకు యూదులు... హిందువులకు.. అంటరాని వాళ్లు ఉన్నారు. వీళ్లెవరినీ పది మంది ముందూ దారుణంగా అవమానించలేదు. నలుగురిలో నవ్వులపాలు చేయలేదు. కానీ అంటరానివాళ్లు నలుగరిలో హేళనకు గురయ్యారు. ఇది కేవలం అంటరాని వారు మాత్రమే ఎదుర్కొన్న అవమానం. బానిసత్వం పోయింది.. అర్థ బానిసత్వం (serfdom), వెట్టి కమతాల వ్యవస్థ అన్నీ పోయాయి. కానీ అంటరానితనం అలాగే కొనసాగుతున్నది. హిందూమతం పోయేంత వరకూ ఇది కూడా పోయేలా లేదు. అంటరాని వాళ్ల పరిస్థితి యూదుల కంటే ఘోరం. యూదులు తమ సమస్యను తామే సృష్టించుకున్నారు. కానీ అంటరాని వారి సమస్య వారికై వారు సృష్టించుకున్నది కాదు. హిందూ మతమే వాళ్ల గొంతు కోసింది. ఈ ఘోర పరాభవాన్నీ, ప్రభావాన్నీ సృష్టించే పనిలో హిందూ మతం తాను ఎంచుకున్న విధానాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేదు. యూదుల్ని ద్వేషించారు కానీ అవకాశాలు ఇవ్వకుండా వారిని కట్టడి చేయలేదు. అంటరాని వాళ్లను ద్వేషించడంతోపాటు ఎదిగేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వారికి ఇవ్వలేదు. అంటరానివారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. 6 కోట్ల మంది అంటరాని వారు... సమస్యలతో కుంగిపోయారే తప్ప వారి గురించి వారు ఆలోచించలేకపోయారు.

Browse more Telugu books