Ganapathi

Editor · History

Ganapathi book cover

Price: Rs. 180. వీరు 1867లో పశ్చిమగోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్గా బిరుదులు పొందిన వీరు ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరివారికి బాసటగానిల్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ప్రహసనం. పద్యనాటకం ఒకటేమిటి రచనా ప్రక్రియలన్నింటిలోను ప్రవేశం ఉన్నవారు. ఆంధ్రస్వాతంత్రోద్యమ గీతం 'భరత ఖండంబు చక్కని పాడియావు' అనే గీతాన్ని రాశారు. అంతేకాక ఎన్నో వ్యంగ్య రచనలు, నవలలు, ప్రహసనములు వ్రాసి సుప్రసిద్ధులయ్యారు. సుమారు 14 నవలలు రాశారు. వీరు వ్రాసిన 'గయోపాఖ్యానం' ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రదర్శించబడటమేకాక ఎన్నో ముద్రణలు పొందింది. వీరు గ్రాంధిక వాదాన్ని సమర్థించినా. వీరి శైలి వ్యవహారానికి దగ్గరగా ఉండి నేటి పాఠకులను చదివింపజేస్తుంది. వీరి స్వీయ చరిత్రము 1944లో ప్రచురించబడింది. వీరు 17.4.1946 లో పరమపదించారు .

Browse more Telugu books