Gaddi Parakatho Viplavam
Editor · Personality Development

Price: Rs. 225. మసనోబు ఫుకుఓకా పొలాన్ని దున్నకుండా, యంత్రాలూ ఎరువులూ పురుగుల మందులూ ఏవీ వాడకుండా ప్రకృతిని సాధ్యమైనంత వరకూ అనుసరిస్తూ వ్యవసాయం చేశాడు. ఆయన అనుసరించిన పద్ధతుల వల్ల నేల ఏ ఏటికాఏడు సారవంతమవుతూ వచ్చింది. జపాన్లోని మరే ఇతర ప్రాంతానికీ తీసిపోని పంటదిగుబడులను తన పొలంలో సాధించి సంచలనం సృష్టించాడు. ఆయన అనుభవాల సారమే ఈ పుస్తకం. 1975లో జపనీస్ లో వెలువడిన ఈ పుస్తకం 1976లో ఇంగ్లీషులోకీ ఆ తరువాత అనేక ఇతర భాషలలోకీ అనువాదమయి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిని పొందింది. ప్రకృతి ప్రేమికులూ, వ్యవసాయ రంగం గురించి ఆసక్తి వున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో 'దేశికోత్తమ' పుసర్కారం ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ఆయన హైదరాబాదున్ను కూడా సందర్శించారు. 'వ్యవసాయం వ్యాపారం కాదు, జీవన విధానం’ అన్న భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే పుస్తకమిది.