Fredaric Angles, Socialist Viplava senani Lenin, American Samrajyavadi Vaidolagu, Bharatheeyathapai Buldojar

Editor · Cinima

Fredaric Angles, Socialist Viplava senani Lenin, American Samrajyavadi Vaidolagu, Bharatheeyathapai Buldojar book cover

Price: Rs. 122. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలు చేయడమెలాగో కార్మికవర్గానికి బోధించడమే కాకుండా, ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మానవ సమాజ చరిత్రలోనే తొలిసారిగా రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేశాడు లెనిన్. అందుకే మార్క్సిస్టు సిద్ధాంతం, రష్యా విప్లవం తరువాత, మార్క్సిజం-లెనినిజం అయి ప్రపంచ కార్మికవర్గానికి ఒక ఆయుధంగా మారింది. లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్. లెనిన్ అనేది ఆయన పెన్ నేమ్. కానీ ఆ పేరుతోనే ఆయన చరిత్రలో ప్రసిద్ధి చెందాడు. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఈ 2024 జనవరి 21 నుండి 2025 జనవరి 21 వరకు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని... లెనిన్ ఎలా జీవించాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు అన్న విషయాలను ప్రాథమికంగా చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. లెనిన్ జీవితం, కృషి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి పాఠకులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాన్ని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది? ఆర్ఎస్ఎస్ దాడి ముస్లింల మీద, మైనార్టీల మీద అని భావించి ఉపేక్షించడానికి ఇంకెంతమాత్రం తావులేదు. నిజానికి బిజెపి-ఆర్ఎస్ఎస్ పరివారం... దేశభక్తి, భారతీయ సంస్కృతి వంటి ప్రచారాల మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నది. సంఘపరివార్ రాజకీయాలను కేవలం మతతత్వ కోణం నుండే కాకుండా ఆర్థిక కోణం నుండి కూడా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి బిజెపి ప్రభుత్వం అనేది మతతత్వ, కార్పొరేట్ రాజకీయాల కాక్స్టైల్ పాలన. దీన్ని ఈ రెండు పార్శ్వాల్లో ఎదుర్కొవడం ద్వారా మాత్రమే వెనక్కు తిప్పికొట్టగలం. సంఘ్ పరివార్ మతతత్వ రాజకీయాలు, వ

Browse more Telugu books