Fiza

Editor · Stories & Poetry

Fiza book cover

Price: Rs. 280. సంవేదన షాజహానా కవిత్వ ప్రాణవాయువు. ముస్లిం మైనారిటిలో మైనారిటి దూదేకుల స్త్రీ గళం, ప్రకృతి, ప్రణయం, స్త్రీ స్వరం, తెలంగాణ నేల తపనల సహజాభివ్యక్తి ఆ అగ్నిని అంటుకునే బయటికొస్తవి. భావుకత ఆమె కవిత్వానికి పరిమళం. అతినవ్య ఇమేజరీలు, సరికొత్త దృశ్యాలు ఆమె కనురెప్పల సునిశిత దృష్టిలో కవితగ ఇమిడి పోవలసిందే! ఇచ్చ (Will) ఆమె కవిత్వ భూమిక. ఆకాశమైనా ఆమె ఇచ్ఛముందు అవనతం కావాల్సిందే. సముద్రమైనా సాగిల పడాల్సిందే. సంవేదన ఇచ్ఛ భావుకతల Stream కు స్వాగతం! - సుంకిరెడ్డి నారాయణరెడ్డి షాజహానా కవిత్వంలో ఒక నిర్భీతి, ఒక ఖచ్చితత్వం ఉంటాయి, ముస్లిం సమాజంలో నిలబడి ఆ స్త్రీల పక్షం వహిస్తూ వారి సమస్యలన్నింటి అనుభవాల్ని తనవిగా చేసుకొని రాస్తుంది. తన కవిత్వంలో ముస్లిమీయ అభివ్యక్తి, భాష కనిపిస్తాయి. తన చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ సమస్యలను, అనుభవాలను చాలా నేర్పుతో చాలా ఒడుపుతో శక్తివంతంగా కవిత్వీకరించడం షాజహానా ప్రత్యేకత. - వినోదిని జీవించడంలోని kinetic energy శైలీ రూప వస్తువులను fuse చేసి, అనుభవాన్ని రెట్టింపు చేసి ఆకర్షిస్తూంటుంది షాజహానా కవిత్వమంతా.. తన తెలంగాణా స్థానిక సోపతిలోని ఉర్దూ చింతనతో తనని discover చేస్తుంటుంది.. వొక జలవిద్యుత్ అయ్యి, మనలోకి ప్రస్తారమయ్యే స్త్రీత్వం. పుండు భూమి జీవ నెత్తుటి 2. First person singularity ໑໐ 2 multiple singular కమ్ముకునే కవిత్వం.. supreme silence తో, ధిక్కారంతో తన స్వీయాత్మ స్త్రీత్వపు కారుణ్య పాదాలతో ఈ కాలపు పెద్ద దర్వాజా ముందుకు వచ్చి నిలబడింది. - సిద్ధార్థ

Browse more Telugu books