FASCIST R.S.S (Swarupam-swabhavam)
Editor · Best Selling

Price: Rs. 55. ఈ పుస్తకం సరైన తరుణంలో రచయిత మన ముందుంచారు. కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించుకుని హిందూత్వ మతోన్మాద శక్తులు మన సమాజంలోని అన్ని పార్శ్వాలను విద్వేషపూరితం చేస్తున్నాయి. దేశంలోని అన్ని మూలలలో మత ఉన్మాద విషబీజాలను నాటుతున్నాయి. 2014లో మోడీ నాయకత్వాన బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ఒక పథకం ప్రకారం అమలవుతున్నది. ఈ మధ్య కాలంలో అది మరింత వేగం పుంజుకున్నది. 2024 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి తన కాషాయీకరణను పూర్తిచేయాలన్న తపనతో బిజెపి పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ శత సంవత్సరాలు 2025లో పూర్తిచేసుకోనున్న సందర్భంలో మన రాజ్యాంగాన్నే హిందూత్వ సాధనంగా మార్చి గురుదక్షిణగా సమర్పించాలన్న కదన కుతూహలంతో మతోన్మాద శక్తులు పనిచేస్తున్నాయి. ఇటువంటి కీలక సమయంలో చారి గారి పుస్తకం రావడం మతోన్మాద శక్తుల ప్రమాదకర ప్రయత్నాలను అర్ధం చేసుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది.