Enumu Yugam Matha Viplavam క్రీ.పూ.700 నుంచి 350

Editor · Best Selling

Enumu Yugam Matha Viplavam క్రీ.పూ.700 నుంచి 350 book cover

Price: Rs. 190. భారతదేశ చరిత్రలో క్రీ.పూ.700 నుంచి 350 వరకు నడచిన అత్యంత ప్రధానమైన దశ గురించి ఈ పరిశోధక గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో ఇనుముకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందింది. పనిముట్లు రూపుమార్చుకుని బహుళమయ్యాయి; నగరాలు తలయెత్తాయి, వాణిజ్యం విస్తరించింది; సైనిక దళాలతోనూ, ఉన్నతాధికార వర్గంతోనూ కూడుకున్న బలమైన రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి; జైన, బౌద్ధాలు నిజమైన అర్థంలో మత విప్లవాన్ని తీసుకువచ్చాయి. ఈ మొత్తం గురించి నాలుగు అధ్యాయాల్లో స్పష్టమైన, అరమరికలు లేని చిత్రణ వున్నది, వివాదాస్పద అంశాలను మరుగుపరిచే ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పంచ్ మార్క్ నాణెముల యుగం, ఉత్తరాది నలుపు మెరుగు పాత్రలు, కాలక్రమణిక సమస్యలు, లిపి ఆవిర్భావంల గురించి ప్రత్యేక వివరాలు వున్నాయి. ఆకరాల నుంచి ఇచ్చిన తొమ్మిది ఉటంకింపులు పాఠకునికి మూల గ్రంథాలను హృదయానికి దగ్గర చేస్తాయి. దీనిలో పన్నెండు చిత్రాలు, ఏడు పటాలు, గ్రంథాంతమున కాల క్రమణిక పట్టిక కలదు. ప్రతి అధ్యాయం చివరన ఉపయుక్త గ్రంథాల జాబితా వున్నది. ఆధార గ్రంథాలతో పాటు, చదవదగ్గ గ్రంథాల వివరాలు కూడా వున్నాయి.

Browse more Telugu books