Enugula Veeraswamy Kashi Yatra
ఎం. ఆదినారాయణ / M. Adinarayana · History

Price: Rs. 225. ఏనుగుల వీరాస్వామి అనే ఒక తెలుగు మహానుభావుడు 19వ శతాబ్దంలో, 100 మంది తీర్థయాత్రికులను చెన్నపట్నం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి, వారిని క్షేమంగా చెన్నపట్నానికి తీసుకొని రాగలిగాడు. 4 వేల కిలోమీటర్లపాటు జరిగిన ఈ ప్రయాణంలో గంగానది మీద 1000 కిలోమీటర్లపాటు పడవ ప్రయాణం కూడా చోటు చేసుకొంది. 15 నెలల, 15 రోజుల, 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ ప్రయాణం (1830-1831) ప్రపంచ తీర్థయాత్రా చరిత్రలో ఒక అరుదైన సంఘటన. డా॥ మచ్చ హరిదాసు (తెలుగులో యాత్రా చరిత్రలు) ఒకడు ధనము ఆర్జించి దాన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టకుండా చనిపోవుట నిష్ఫలం. - ఏనుగుల వీరాస్వామి వీరాస్వామి యాత్రకి వెళ్ళేటప్పుడు నేను అక్కడి వినోదములను రాయించి పంపించాలని అడిగినందుకు ఆయన రాసి పంపుతూ వచ్చారు. - కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ మా తాతగారి పేరు కిత్తయ్య పంతులు. వారికి తాతగారైన కిత్తయ్య గారు వీరాస్వామికి దివ్వెల గ్రామంలో ఆతిథ్యం ఇచ్చారు - ఆరుద్ర (సమగ్ర ఆంధ్ర సాహిత్యం) ఈ గ్రంథం తెలుగు వాఙ్మయంలో అపూర్వమైనది. - దిగవల్లి వెంకట శివరావు