English Teacher (ఇంగ్లీష్ టీచర్ )
Editor · Best Selling

Price: Rs. 120. ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడం లేదు. నిజం చెప్పాలంటే మరింత ఎక్కువవుతున్నది. ఇలాంటి సమయంలో ఈ భాషను నేర్చుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇది పరాయి భాష ఓ భారతీయ భాష వచ్చిన వారు, మరొక భారతీయ భాష నేర్చుకోవడం కొంత సులభం. కానీ ఇంగ్లీష్ అలాంటిది కాదు. అయినప్పటికీ తేలిగ్గా నేర్చుకోడానికి అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి. అనేక పద్ధతుల్లో నేర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి కోవలోకే చెందింది ఈ ఇంగ్లీష్ టీచర్ పుస్తకం. ఇంగ్లీష్ భాషను నేర్పించడంలో పలు విధాలుగా కృషి చేస్తున్న బేబీ ని సంజీవ్ ఈ పుస్తకాన్ని రచించారు. కొత్తగా దేన్నైనా తెలుసుకోవాలంటే బాగా తెలిసిన వారెవరైనా బోధించాలి. అలాంటి పుస్తకాలూ అనేకం వెలువడ్డాయి. వాటన్నింటికి బిన్నంగా ఈ పుస్తకం ప్రత్యేక తరహాకు చెందింది. నేర్చుకునే విద్యార్ధే స్వయంగా టీచర్ గ మారేలా విభిన్న శైలిలో ఉంటుంది. తెలుగు లో వివరణలు, ఉచ్ఛారణలు ఉన్నప్ప టికీ ఇంగ్లీషును స్వంతంత్రంగా అర్థం చేసుకోవడానికి, మాట్లాడటానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ పుస్తకం