Endharochhina....

Editor · Politics

Endharochhina.... book cover

Price: Rs. 135. తెలంగాణ మట్టిపైన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంపైన జూలూరు గౌరీశంకరు అచంచలమైన నమ్మకం, విశ్వాసం, గౌవరం ఉన్నాయి. అందుకే 2018 ఎన్నికల సందర్భంలో మేధావులనుకున్న పలువురు పలుపలు రకాల వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను గందరగోళాలకు గురిచేస్తున్న సందర్భంలో గౌరీ శంకర్ మాత్రం స్పష్టంగా కేసీఆర్ గెలిచి తీరుతాడని, కేసీఆర్ గెలుపు తెలంగాణ గెలుపు అని ధైర్యంగా ప్రకటించారు. కేసీఆర్ వ్యుహాలను, ఎత్తుగడులను, కేసీఆర్ దార్శనికతను జూలూరు తన వ్యాసాల ద్వారా అక్షరీకరించారు. ఎన్నికల సమరంలో రోజుకొక్క గందరగోళాల పెప్పర్ స్ప్రేల అబద్దపు సర్వేలు కుమ్మరిస్తున్న వేళ అవన్నీ తప్పని కొట్టి పారేస్తూ గౌరీశంకర్ వ్యాసాలు రాశారు. సెఫాలజిస్టుల సర్వేలకు, ప్రజల హృదయ స్పందనలకు మధ్య ఎంతో తేడా ఉందని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగా అత్యధిక స్థానాలను గెలుచు కోవడంతో ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ గెలిచినట్లయ్యాయి. ఈ పుస్తకంలో 51 నెలల కేసీఆర్ పాలనలో జరిగిన కృషినంతా రికార్డు చేయడం జరిగింది. కేసీఆర్ అభివృద్ధి పనులను పూర్తిచేస్తూ ఎలా ముందుకు సాగారో ఎన్నికల యుద్ధ సమయంలో సావధానంగా వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణ పనులను పూర్తి చేస్తూ కేసీఆర్ కఠోర దీక్షా దక్షతను గౌరీశంకర్ తన కలం ద్వారా చాటి చెప్పారు. కేసీఆర్ కృషినంతా ఈ వ్యాస సంపుటిలో జూలూరు పొందుపరిచారు. ఎన్నికల సమయంలో వచ్చిన ఈ వ్యాసాలను ఫలితాల తరువాత విశ్లేషించుకుంటే అందుకు ఈ పుస్తకం అక్షర సత్యంగా దర్శనమిస్తుంది. ఇది కొనసాగుతున్న తెలంగాణ విజయగాథకు కొనసాగింపుగా ఈ పుస్తకం నిలుస్తుంది.

Browse more Telugu books