Em Cheyali?
Editor · Politics

Price: Rs. 180. భారతదేశంలో కమ్యూనిస్టులే గనుక బలంగా ఉండివుంటే ఎంత బాగుండును? అని అనుకునేవాళ్ళు, ముక్కలైపోయిన కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే ఒక బలమైన పార్టీగా ఏకమైపోతే బాగుంటుంది అనేవాళ్ళు మనకి తారసిల్లుతూంటారు. వారి ఆకాంక్షలు సరైనవే. ఐతే కమ్యూనిస్టులంతా ఐక్యం అయిపోయినంతమాత్రాన కార్మికవర్గం యావత్తూ విప్లవపోరాటానికి సిద్ధం అయిపోతుందనుకుంటే అది పొరపాటు. ఆ కార్మికవర్గానికి సోషలిస్టు చైతన్యాన్ని కల్పించే కృషి అనేక రెట్లు పెరగాలి. ఈ కృషి ఎంత పెరిగితే అంత వేగంగా విప్లవకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ కృషిని సమర్ధవంతంగా చేయగల బలమైన పార్టీని నిర్మించడం ఇప్పుడు ప్రధానం. * ఈ ప్రధాన కర్తవ్యాన్ని సక్రమంగా అవగతం చేసుకోడానికి 'ఏం చేయాలి?' చాలా ఉపయోగపడుతుంది. దీనిని చదివేటప్పుడు మన రోజువారీ ఆచరణతో సరిపోల్చుకుంటూ చదివితే ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది.