Ee Mohanuvunnadu Choodandi..!
Editor · Stories & Poetry

Price: Rs. 180. ‘నాన్నా నువ్వు మనిషివేనా... నేరం చేస్తున్నావు... అమ్మకేమన్నా అవుతుంది ఏ లక్షణాలూ లేకుండా కూడా కరోనా వస్తుంది. అమ్మ గురించి ఆలోచించు ప్లీజ్ నాన్నా, దండం పెడతాను. ట్రావెల్ బాన్ ఉంది. లేకపోతే మేం వచ్చేవాళ్ళం. మొన్నే మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఏ లక్షణమూ లేకుండానే కరోనాతో చనిపోయింది... నాన్నా ప్లీస్... ప్లీస్... అమ్మ... అమ్మ... గురించి ఆలోచించు. నువ్వు గట్టెక్కితే కాదు నాన్న క్వారంటైన్ కాకుండా ఇల్లంతా కరోనా వైరస్ నింపేసావు. ఇప్పుడు క్వారంటైన్ పూర్తి రోజులు కాకుండానే.. టెస్ట్ నెగటివ్ రాకుండానే ఇంట్లో తిరిగేస్తున్నావు. నీకెవరిచ్చారు ఈ హక్కు.. అమ్మకీపాటికీ కరోనా వచ్చే ఉంటుంది. నాన్నా అమ్మకేమైనా అయితే నీ ముఖం చూడం... ఇంటికే రాము... నాన్నా.... అమ్మ... అమ్మ నాన్న... అమ్మ, పిల్లల ఏడ్పులు ఆక్రందనలు నిస్సహాయపు వేడుకోళ్ళు ఆగ్రహ ప్రకటనల మధ్య... మోహన్రావు నిశ్చింతగా తనకు తగ్గిందని తిరుగుతున్నాడు. నేను ఏడ్చా... చేతులు జోడించా... నా పిల్లల కోసవు నేను బతికి తీరాలన్నా... ఏడ్చా..., చాలా ఏడ్చా... ఉహూ... మోహన్రావు వినలే. నేను పెరట్లోనే అతగాడ్ని తప్పించుకుంటూ తప్పించుకుంటూ బతకసాగాను. చెట్లకింద... షెడ్డులో మంచం వేస్కొని ఖంగారు... ఖంగారుగా వంట చేసేసి పెరట్లో కొచ్చేయడమే ఏం చేస్తా ఇక... ఇంట్లో నిలువెల్లా పీపీఇ వేస్కుని, భయం భయంగా తప్పించుకు తిరుగుతున్న నన్ను చూస్తూ "ఒర్థి పిరిగ్గొడ్డు" అని వెటకారంగా నవ్వుతాడు. దుర్మార్గుడు వినడు... "అమ్మా నవ్వు ఇల్లొదిలి వెళ్ళిపో... ఎక్కడికైనా పిన్ని వాళ్ళింటికో... మామయ్య ఇంటికో..." కొడుకు సాగర్.