EE KALAM PILLADU (Balala navala)
Editor · Best Selling

Price: Rs. 99. నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారు ప్రసిద్ధమైన బాలల రచయిత. బాల సాహిత్యంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినవారు. వారు రాసిన బాలల నవల 'ఈ కాలం పిల్లాడు'. నేటి బాలలకు చాలా విజ్ఞానదాయకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదట ఒక రచనను చదివే ఉత్సుకతను పెంపొందిస్తుంది. బాలలకు సంబంధించిన ఆవరణంలోకి చదువరులను తీసుకువెళుతుంది. చిన్న చిన్న కథలను వినడం, చదవడం, ఆనందించడం చేస్తున్న బాలలకు, ఇంకొంత శ్రద్ధతో ఒక జీవితపు కాలాన్ని చదివే అలవాటు చేయడం. అనేక మానసిక, సామాజిక అంశాలను అవగాహన చేసుకునే స్థాయికి పిల్లలను తయారు చేయటం నవల చేస్తుంది.