EDUREETHA / ఎదురీత
బొజ్జ బిక్షమయ్య. / Bojja Bikshamayya. · Biographies & Auto Biographies

Price: Rs. 108. బిక్షమయ్య ఉద్యమ జీవితం, జ్ఞాపకాలు క్లుప్తంగా సూటిగా వుండటమే గాక, ప్రస్తుత సమాజంలో జీవితం అంటే అన్ని రకాల ఆధిపత్య శక్తుల్ని ఎదిరించడం' అన్న స్ఫూర్తిని కల్గిస్తున్నది." - బి.వి రాఘవులు "సుదీర్ఘ అనుభవాలలో అడుగడుగునా ఆయన ప్రదర్శించిన అంకిత భావం ఆదర్శనీయం. మనందరికీ అనుసరణీయం. ఆయన దృఢదీక్ష, రాక్షసుడిలా కష్టపడి పనిజేసే తత్వం, అన్నింటికీ మించి ఉద్యమం, కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతను నేను బాగా ఇష్టపడతాను." - తమ్మినేని వీరభద్రం కా॥ బిక్షమయ్య ముక్కుసూటి మనిషి, తనకు నచ్చని దానిని చెప్పడంలో ఎప్పుడు వెనకాడడు. కొన్ని సందర్భాలలో అవి అనేకులకు యిబ్బంది కూడా కల్గించవచ్చు. కానీ అది ఆయన సహజసిద్ధస్వభావం. జి. రాములు "ఈ పుస్తకంలో బిక్షమయ్య పోరాటాలు, విజయాలతోపాటు కమ్యూనిస్టుగా బిక్షమయ్య కార్మికులకు, ప్రజలకు చేసిన పనులు ఉన్నాయి. దీనిని అందరూ చదవాలని ఆశిస్తూ.” - కంచ ఐలయ్య షెఫర్డు "ఈ పుస్తకాన్ని ఎవరు చదివినా ఎర్రజెండాపై గౌరవం పెరుగుతుందే కాని వ్యతిరేక భావం కలుగదు. వామపక్ష భావాలను ప్రేమించి, ఆచరించి, పలువరించి, కలువరించి రాసిన ఈ పొత్తం ఎందరికో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. అటు మార్క్స్ ను, ఇటు అంబేడ్కర్ను చెరో భుజం మీద మోసుకుంటూ, తిరుగుతున్న ఈ అరున్నర దశాబ్దాల యువకుడు బొజ్జబిక్షమన్న గుండెల్లోంచి వెలువడిన స్వీయచరిత్రను చదవండి.” - డా॥ కాలువ మల్లయ్య "మార్క్స్-అంబేడ్కర్ కళలు కన్న బడుగు బలహీన వర్గాల శ్రామిక రాజ్యం కోసం పనిచేస్తున్నాడు." -జయరాజు