Edu Tharalu

Editor · Best Selling

Edu Tharalu book cover

Price: Rs. 225. విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన- ఈ ఏడు తరాల బానిసల కథ ! ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. 'రూట్స్' పేరుతో 1976లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడు పోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.

Browse more Telugu books