Edi Sukham...? Edi Dukkham...?
Editor · Novels

Price: Rs. 125. ఏది సుఖం...? ఏది దుఃఖం...? డా॥ కాలువ మల్లయ్యగారు వందలాది కథలు రాశారు. అవి వెయ్యికి పైగా చేరి ఉంటాయి. రెండు పదులకు పైగా నవలలు రాశారు. ఏదో ప్రత్యేక విషయం మీద నవల రాయడం కాలువ మల్లయ్య విశిష్టత. మానవ జీవన దర్శనానికి సంబంధించిన విశిష్ట అంశాలను చిత్రించిన నవల, ఏది సుఖం? ఏది దుఃఖం? ఇది బౌద్ధ దర్శనం. ఈ నవల స్వాతి మాస పత్రికలో 2001లో అనుబంధ నవలగా ప్రచురించ బడింది. అప్పటికీ ఇప్పటికీ మధ్య తరగతి జీవితంలో, ఆలోచనల్లో ఏమీ మార్పు రాలేదు. అదనంగా వచ్చి చేరిన గ్లోబలైజేషన్, ప్రయివేటైజేషన్ సృష్టించిన సమస్యలు కూడా ఆనాడే ఈ నవలలో చిత్రించాడు రచయిత. ఒక రకంగా చెప్పాలంటే బౌద్ధ తాత్వికతకు ఈ నవల ఒక ఆధునిక రూపాన్ని ఇచ్చింది. జీవితంలో బుద్ధుడు చెప్పిన విషయాలు ఎలా కొనసాగు తున్నాయో అందుకు నిదర్శనంగా రాసిన నవల ఇది. అందువల్ల ఈ ఒక్క చైతన్య స్రవంతి నవల మాత్రమే కాదు. ఇది గ్రామీణ ప్రజలు తొలితరం విద్యావంతులుగా మధ్య తరగతిగా, ఉద్యోగులుగా ఎదుగుతున్న క్రమాలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది మానవ జీవితంలోని బుద్ధుడు చెప్పిన దుఃఖానికి సంబంధించిన నవల.