Edena Bangaru Telangana?

Editor · Politics

Edena Bangaru Telangana? book cover

Price: Rs. 140. నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తుందని ప్రజలు ఆశించారు. వాగ్దానం చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణా సాకారం పొందుతుందని పాలకవర్గాలు, ప్రజలు ఆకాంక్షించారు. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా ఆ దిశలో పురోగమిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. చేసిన వాగ్దానాలను వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఏ ఒరవడిలో నడిచారో అదే ఒరవడిని, విధానాలను కొనసాగిస్తున్నది. బడుగు బలహీనవర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి, నీటి వనరుల మానవ వనరుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయబడినటువంటి తెలంగాణాను అభివృద్ధి బాట పట్టించాలంటే, సామాజిక న్యాయాన్ని, ప్రజా సంక్షేమాన్ని, సమగ్రాభివృద్ధిని సాధించాలంటే నూతన మార్గాలను అన్వేషించాలి. కొత్త ఆలోచనలను చేయాలి. అందుకే మహాజన పాదయాత్ర సందర్భంగా సిపిఐ(ఎం) అటువంటి సమగ్ర ప్రత్యామ్నాయ, అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచింది. చర్చకు పెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రజల స్పందన, ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రతినిధులు, సామాజిక రాజకీయ శక్తుల, మేధావుల స్పందన చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను, సామాజిక న్యాయాన్ని కోరే విభిన్న శక్తుల ఆకాంక్షలను అది ప్రతిబింబిస్తున్నదనే విషయం స్పష్టం అయింది. ఈ పుస్తకంలోని ఉత్తరాలు ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. - బి.వి. రాఘవులు, సిపిఐ(ఎం) పొలిట్యూరో సభ్యులు.

Browse more Telugu books