Edandi Na Katha
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 115. ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ ఛైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడి తోను, ఒకే ఒక్క క్లయింట్ తోను అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్ర భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ప్రభుత్వంలో చిన్న గుమస్తా ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పొరేట్ రంగంతో అతిచేరువగా కలిసి పనిచేసి అతికొద్ది కాలంలో తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ముద్ర కమ్యూనికేషన్సు ఛైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోను, తెలుగులోను పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వారి పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.