Eban Bhathutha Prapancha Yathra
Editor · History

Price: Rs. 270. 'జ్ఞానాన్వేషణలో చైనా వరకూ వెళ్ళటం మంచిదే అని చెప్పిన మహమ్మద్ ప్రవక్త సూక్తిని ఆదర్శంగా తీసుకుని, ఇద్రీసి తయారు చేసిన ప్రపంచపటాన్ని తోడుగా ఉంచుకొని, తన ఇరవై ఒకటవ సంవత్సరంలో మొరాకో దేశంలోని టాంజీర్ పట్నం నుండి ఒంటరిగా ప్రపంచ యాత్రకు బయలుదేరిన ఇబన్ బతూతా (1304-1369) లక్షా పదివేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ముస్లిందేశాల మార్కోపోలోగా కీర్తించబడ్డ ఇబన్ బతూతా సుదీర్ఘమైన ప్రయాణ అనుభవాలని 'రిహ్లా ' అనే పేరు మీద అరబ్బు ప్రపంచానికి అందించిన మొరాకో సుల్తాన్ అబూ ఇనాన్ ఫారిస్ (1329-1358) చిరస్మరణీయుడు. అలెగ్జాండ్రియా రేవులో దీపస్తంభాన్ని ఈజిప్టులో పిరమిడ్లనీ మక్కాలో కాబా మందిరాన్ని ఇరాన్ లో కవి సాదీ సమాధిని దర్శించుకొని ఢిల్లీలో ఏడు సంవత్సరాల పాటు మహమ్మద్ బిన్ తుగ్లక్ (1290-1351) పాలనలో కాజీగా పనిచేసి, మాల్దీవుల్లో వివాహాలు చేసుకొని, చైనాలో పెకింగ్ నగరాన్ని దర్శనం చేసుకొని ఒంటరిగా ఇంటికి చేరుకొన్న ఒక మహాయాత్రికుడి స్వీయచరిత్ర.