Syeda X
Neha Dixit · Women

Price: Rs. 385. నేహా దీక్షిత్ దృఢ మనస్కురాలు, ధైర్యస్తురాలు, సహానుభూతి గలిగిన రచయిత్రి. మనసును హత్తుకు పోయి, పాఠకుడిని కుదిపేసే ఈ పుస్తకం ద్వారా ఆమె అదృశ్యంగా వుండే సామాన్య భారతీయుల మీద వెలుగును ప్రసరించింది. సరళంగా వున్నా ప్రభావవంతమైన శైలిలో -సామాన్య భారతీయుల జీవితాలను అదృశ్యపు చీకటి నుంచి వెలికి తీసింది. అంతేకాదు -వారిని అవహేళనపూరితమైన జాలి, కనికరంతో కూడిన కాలం చెల్లిన కథనాల నుండి బయటపడేసి - వారి స్వయం నిర్ణయాలకు గౌరవస్థానం ఇస్తుంది. ఈ పుస్తకం. మనల్ని మనం ఏ రకంగా సమర్ధించుకోలేకుండా చేసి, ఈ పుస్తకం అంతర్లీనంగా గాయపరుస్తుంది. -ప్రతాబ్ భాను మెప్త సూక్ష్మవివరాల నివేదికను, ఆయా కాల స్థల భావోద్వేగ అనుభూతులతో అద్భుతంగా మేళవించిన పుస్తకం ఇది. ఒక కుటుంబం ఎదుర్కొన్న బతుకు పోరాటాల ద్వారా గత మూడు దశాబ్దాలుగా దేశం అనుభవించిన కల్లోల, సంఘర్షణాత్మక చరిత్రను నేహా దీక్షిత్ చాకచక్యంతో అన్వేషిస్తూ వెళ్లింది. 'అభివృద్ధి కథనంగా' ప్రపంచానికి ఢంకా మోగించి చెబుతున్న దాని వెనుకాల మత ఆధిపత్య రాజకీయాల స్వరూపం, అందులో దాగిన చీకటి కోణాలను లోతుగా అర్ధం చేసుకునే అవకాశాన్ని ఈ పుస్తకం పాఠకులకు కలగచేస్తుంది. అద్భుతమైన ఈ తొలి రచన మనసులో గాఢమైన ముద్రను వేస్తుంది. -రామచంద్ర గుహ నైతిక విలువలు, అచంచల నిబద్ధత కలిగిన ఒక జర్నలిస్ట్ నేహా. నిజాయితీతో, ఒక తపనతో రచనలు చేస్తారు ఆమె. ఆధునిక భారతదేశ చరిత్రలో సంభవించిన విప్లవాత్మక సంఘటనల చరిత్రనే శ్రామిక ముస్లిం మహిళ జీవన చరిత్రగా చెప్పుకోవచ్చు. ఆ చరిత్ర చెబుతూ నేహా - ఎవరికి తెలియని కార్మికవర్గ ముస్లిం మహిళ జీవితాలను దహించేటంతటి సాంద్రతతో కథగా అల్లారు. -నివేదితా మీనన్ ఆధునిక భారతదేశ ప్రజల హృదయాన్ని ద్రవింపచేసే కథ ఇది. రచయిత్రి తన పక్కనుండే దుఃఖితులైన మహిళలు, ప్రజల కళ్లనుండి చూస్తూ ఎలాంటి అలంకారాలు లేని వాస్తవాన్ని రచించారు. యాంత్రికమైన తమ ఉనికి ద్వారా మనకు ఒకరకంగా ప్రయోజనం కలిగిస్తూ, ఇంకోపక్క చికాకును కలిగించే పేరులేని పేదలు అశేషంగా వున్నారు. సయ్యదా జీవితం మన స్వభావాన్ని అద్దంలో పట్టి చ