Rangu Pula Vagu
Puppala Krishnamurthy · Stories & Poetry

Price: Rs. 145. మంచి కథలకు చాలా నిర్వచనాలే ఉన్నాయి. స్థూలంగా హృదయాన్ని కదిలించే శక్తి గల ఏ రచనయినా మంచిదనడానికి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఆ కదలిక హృదయంలోనే ఆగిపోకుండా ఆ మనిషిని కూడామార్పుకై కదిలించగల సందేశాన్ని కళాత్మకంగా అందించిన నాడు, రచయిత సమాజ పురోగమనానికి తోడ్పడగలుగుతాడు. ఏ కాలంలోనైనా కళా సాహిత్యాలకు అంతకన్నా పరమార్ధం ఉండదనుకుంటాను. ఆ దృష్టితో ఈ కథల్లో వాస్తవికతా, వైవిధ్యమూ, నిబద్ధతా, నిజాయితీ ఉన్నాయి. -తెలకపల్లి రవి ఏదో కొసకు జరగకుండా రచనలు చేయడం కత్తి మీద సాములాంటిది. నిరంతర అధ్యయనం, నమ్రత మాత్రమే ఆ కళా నైపుణ్యాన్నిస్తుంది. రచనలతో నూతన సృష్టి జరపడం జీవితమంత కష్టమైన పని. ఈ రచయిత సంచలనం కోసం రాసేవాడు కాదు. మంచి చెడును విప్పి చెబుతూ పిల్లలకు ఆరోగ్యకరమైన సాహిత్యాన్ని అందిస్తూ రేపటి తరం మానవాభ్యుదయం కోసం సాగాలని కోరుకునే నమ్రత గల రచయిత పుప్పాల కృష్ణమూర్తి. - పి. చంద్రశేఖర్ ఆజాద్ వీరు నిజాయితి, నిబద్ధత గల రచయిత. క్షుద్ర, పాపులారిటీ సాహిత్యోప్పత్తిలో అడుగుపెట్టకుండా సామాజిక ప్రయోజన దృష్టి తోనూ, బాలల మనో వికాస చైతన్య కారక విధంగానూ, సాహిత్యాన్ని సృష్టిస్తున్న అరుదైన సృజన కారుల మొదటి పంక్తిలో నిలబెట్టదగిన మంచి సృజన కారులు మన కృష్ణమూర్తి గారు. - వి.ఆర్. రాసాని పిల్లల్లో మంచి పిల్లలు, చెడ్డ పిల్లలు అనేవారు ఉండరు. పిల్లలందరూ మంచివారే. ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో ఈ సమాజమే వారికి చెడును అంటిస్తుంది. ఆ చెడును అంటకుండా చూడవలసిన బాధ్యత మనమంతా తీసుకోవాలి. ఈ తరం బాలలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తపించే నిపుణత కలిగిన బాల సాహిత్య అక్షర శిల్పి పుప్పాల కృష్ణమూర్తి. -డాక్లర్ వాసిరెడ్డి రమేష్ బాబు