Dudiya
Vishwas Patil / విశ్వాస్ పాటిల్ · Novels

Price: Rs. 135. నేటి నక్సలైట్ల గురించిన నిజానిజాలను బయటపెట్టిన నవల ఇది. రెండువైపులా తుపాకుల నీడలో బతుకుతున్న సామాన్య జనుల కథ ఇది. రెండు ఇరుసుల మధ్య నలిగిపోతున్న అస్త్రశస్త్రాలు లేని బీదప్రజలు, ఇక్కడి నిరాశ నిస్పృహలతో జీవిస్తున్న యువత, ఎటువైపు వెళ్లినా వాళ్ల చేతులకి వచ్చేవి తుపాకులే. ఇటువంటి ఛత్తీస్ గఢ్ లో పసుపుపచ్చటి నేలలో పుట్టి, ప్రకృతి ఒడిలో ప్రకృతితో తాదాత్మ్యం చెంది పెరిగిన అభం శుభం ఎరుగని అల్లరి పిల్ల దుడియా. అక్కడి అస్తవ్యస్తమైన కన్నీళ్లు కడగండ్ల పాలైన జీవితం దుడియాని ఎంతగానో దిగజార్చింది. అక్కడ అడుగడుగునా జీవితం పేలుళ్లతో, హింసతో కూడి ఉంది. ఈ అనుభవాలు ఆమెకి ఏం ఇచ్చాయి. అనుకున్న దొకటి అయిందొక్కటి. అందుకే వాళ్లు శరణాగతులయ్యారు. దీనివల్ల వాళ్లకు లభించిందేమిటి? ఇదంతా హృదయవిదారకం. మండుతున్న ఛత్తీస్ గఢ్ లో జీవితం అంటే ఒక యుద్ధమే. ఈ జీవనతత్వాన్ని బయటపెట్టే రచనే 'దుడియా'. రచయిత అనుభవజ్ఞానం ఇందులో ఉంది. రచన చదువుతుంటే మనం ఉద్విగ్నులవుతాం. చదివాక మనలని ఎంతో కాలం ఆలోచింప చేస్తుంది ఈ రచన. తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ ఖాళీ అయిపోయిన గ్రామాలు, అబూఝమడ్ కొండలు కోనలలో దాగి ఉన్న రహస్యాల వల్ల ఠారెత్తిన ప్రభుత్వాలు, కొండల కడుపులను చీల్చి నీళ్లు, అడవి, నేల తక్కిన ఖనిజాలను దోపిడీ చేయాలని పొంచి ఉన్న దోపిడీదారులైన పెట్టుబడిదారి వర్గం. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ రచన నాకు ఎంతగానో నచ్చింది. విధిరాత అనే పంజాలలో బిగింపబడ్డ బీదజనం చేస్తున్న జీవనపోరాటాన్ని ప్రసిద్ధి చెందిన నవలా రచయిత విశ్వాస్ పాటిల్ ఎంతో సమర్థవంతంగా చిత్రీకరించారు. ఆయన కలంకున్న బలం అందరికీ తెలిసిందే. పాఠకులపై ఎంతో ప్రభావం చూపే రచన అని నిస్సందేహంగా చెప్పవచ్చు.