Dravida (vivakshapai dakshina swaram)

Editor · Politics

Dravida (vivakshapai dakshina swaram) book cover

Price: Rs. 149. "ద్రవిడ" సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చమత్కరించినట్లు ఇది 'ఇడ్లీ సాంబార్- చోలే భతూరే'ల మధ్య గొడవ కాదు, ఉత్తరాది సంస్కృతి భారతదేశపు ఆత్మగా, ఉత్తరాది అభివృద్ధి భారత ముఖచిత్రంగా, హిందీ భాషే భారతీయుల ఏకైక వ్యక్తీకరణగా, హిందూ మతమే రాజకీయ ఆచరణగా, హిందూస్తాన్ భారతి జాతి లక్ష్యంగా- నడుస్తున్న నిర్బంధం మీద ప్రతిఘటన ఈ 'ద్రవిడ'. వివక్షని నిలదీస్తున్న దక్షిణ స్వరం. దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవ పోరాటాలు, ద్రావిడ భాషల ప్రాచీన సాహిత్య సంస్కృతులు, భిన్న అస్తిత్వ ఘర్షణలతో వన్నెదేలిన ద్రావిడ మేధా సమాజాలు, ప్రాంతీయ రాజకీయశక్తుల చైతన్య శీలత, తమని పరాయీకరించే ఉత్తరాది ఆధిపత్యం పట్ల ఎరుక, ఐక్యమవ్వాల్సిన ద్రావిడ శక్తులు- ఈ పుస్తకం చాలా మాట్లాడింది, దక్షిణ స్వరం ఎందుకు మరింత పదునెక్కాలో మనతో మాట్లాడిస్తుంది కూడా.

Browse more Telugu books