Draupadi

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ / Acharya Yarlagadda Lakshmi Prasad · Novels

Draupadi book cover

Price: Rs. 135. * 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోను విద్యార్థి నాయకుడుగా ఆంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు. * హిందీ, తెలుగు భాషలు రెండింటిలో డాక్టరేట్ పట్టాలు పొందిన నిత్య పరిశోధకుడు. మూడు పదులకు పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి పిన్న వయస్సులోనే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని పొందిన రచయిత. * అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్ లాండ్, కెనడా, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరచ్ఎమిరేట్స్ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త. * రాజ్యసభ సభ్యుడుగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడా అధ్యాపకవృత్తిని ఎంచుకున్న బోధనా రంగ ప్రేమికుడు. * పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్ గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది. * తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.

Browse more Telugu books