Dr. Babu Jagjivan Ram

Editor · Politics

Dr. Babu Jagjivan Ram book cover

Price: Rs. 200. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలోని మాదిగ వీధిలో ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన చింతాడ గౌరీవరప్రసాద్ కడు పేదరికంలో ఐటిఐ చదివి భారత ప్రభుత్వ రంగ పరిశ్రమ బిహెచ్పివిలో అస్స్కిల్ కార్మికుడిగా బతుకు జీవనం కొనసాగిస్తూ బిఏ, బిఎల్ సహా రెండు ఎమ్మే డిగ్రీలు పొంది ఆంధ్రా యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో పరిశోధన చేస్తున్నారు. బలహీనవర్గాల అభ్యునతే ధ్యేయంగా పర్సనల్ ఆఫీసర్ హెూదాలోని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో న్యాయవాదిగా పేదలకు సేవలందిస్తున్నారు. పేదరికం, అంటరానితనం, వివక్ష వంటి సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించిన గౌరీవరప్రసాద్ ప్రముఖ మాదిగ కుల చరిత్రకారుడు కూడా... మాదిగల చరిత్ర ఉద్యమం, భవిష్యత్తు, సంస్కృతి వంటి వివిధ అంశాలపై ఆయన విశిష్టమైన రచనలు చేశారు. చరిత్రకారులకు పరిశోధకులకు గౌరీవరప్రసాద్ రచనలు కీలకమైన సమాచారాన్ని అందించడమే కాదు చరిత్ర రచనలో నూతన ప్రమాణాలను నెలకొల్పాయి. దళిత చరిత్ర, తాత్వికత భారతీయ, పాశ్చాత్య తత్వశాస్త్రాలు గౌరీవరప్రసాద్ అంశాలు.

Browse more Telugu books