DR. Baba saheb AMBEDKAR Visleshanatmaka Adhyayanam

Editor · Best Selling

DR. Baba saheb AMBEDKAR Visleshanatmaka Adhyayanam book cover

Price: Rs. 365. డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్ సామాజిక ఆణిచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంకేతం, గొప్ప స్ఫూర్తిప్రదాత. నిమ్నకులంలో జన్మించిన అంబేద్కర్ కులవివక్షను స్వయంగా అనుభవించారు. ఈ వివక్షను అంతం చేసి సమాజంలో అందరితో పాటు నిమ్న వర్గాలకూ సమాన స్థాయి లభించేలా చేసేందుకు ఆయన జీవితాంతం కృషి సల్పారు. అంబేద్కర్ కేవలం దళితుల కోసం పోరాడిన వ్యక్తి మాత్రమే కాదు. గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. న్యాయశాస్త్ర కోవిదుడు. స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర వహించారు. రాజ్యాంగ నిర్మాతగా పేరు గడించారు. అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. భూ సమస్యతో సహా అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ట్రకు చెందిన వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు.

Browse more Telugu books