Dr. B.R. Ambendkar smruthulu-jnapakalu

Editor · Best Selling

Dr. B.R. Ambendkar smruthulu-jnapakalu book cover

Price: Rs. 180. బాబాసాహెబ్ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ స్వీయస్మృతులు, ఆయన ఉద్యమ సేనానులు, అత్యంత సన్నిహితులు ఆయన గురించి పంచుకున్న జ్ఞాపకాల కలబోతతో ఈ పుస్తకం అత్యంత విలువ, విశిష్టత సంతరించుకుంది. డా॥ అంబేడ్కర్ తన జీవనయానంలో చిన్నతనం నుంచీ చనిపోయేవరకూ ఎదుర్కొన్న అనుభవాలు, అవమానాలూ, అడ్డంకులూ, ఆయన వాటిని ఎదుర్కొని విజయం సాధించిన తీరుతెన్నులూ, పోరాట పటిమా ఆయన స్మృతుల ద్వారా, ఆయన్ను చాలా దగ్గరగా వుండి చూసిన, ఆయన ఉద్యమంలో పాల్గొన్న వారి జ్ఞాపకాల ద్వారా మనం ఈ పుస్తకం నుంచి తెలుసుకోవచ్చు. డా॥ అంబేడ్కర్ పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల ఎంతోమంది శత్రువులు చేసిన దుష్ప్రచారాలను, ఆయన ఉద్యమంపై కప్పిన చీకటి తెరలను ఈ పుస్తకం పటాపంచలు చేసి ఒక నూతన జ్ఞాన జ్యోతిని పాఠకులకు అందిస్తుంది. డా॥ అంబేడ్కర్ అద్భుత మేథో సంపత్తి, కఠోరశ్రమ, దీక్ష, మానసిక దృఢత్వం, సున్నితత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదివితీరాలి. ఆయన మహెూన్నత వ్యక్తిత్వం, అంకితభావంతో కూడిన పట్టుదలా, తన ప్రజల విముక్తి కోసం ఆయన పడిన తపనా, వేదన, శ్రమదమాదులు ఈ పుస్తకం చదివేప్పుడు పాఠకుల కళ్లముందు తప్పక కదులాడుతాయి. డా॥ అంబేడ్కర్ జీవితంలోని వైవిధ్యభరిత అనుభవాలు, సంక్లిష్ట పరిస్థితుల కలనేతగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దడంలో రచయిత నానక్ చంద్ రత్తు చేసిన శ్రమ, చూపిన పట్టుదల అనన్యసామాన్యం, అనితర సాధ్యం. 1940 నుంచీ బాబాసాహెబ్ పరినిర్వాణం 1956 వరకూ 16 సంవత్సరాలు నానక్ చంద్ రత్తు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా అనుక్షణం, అహరహం డా॥ అంబేడ్కర్ అనుంగు శిష్యునిగా ఎంతో విలువైన సేవలు అందించారు. కాబట్టే ఆయనకు డా॥ అంబేడ్కర్ అంతరంగం, కష్టనష్టాలు, సున్నితత్వం, భావోద్వేగాలు అందరికంటే ఎక్కువ తెలుసు.

Browse more Telugu books