Dr. B.R.Ambendkar

Editor · Politics

Dr. B.R.Ambendkar book cover

Price: Rs. 110. ఫూలే : మహాత్మ అనే బిరుదుని ప్రజలచే పొంది బడుగుల జీవితాలలో వెలుగులు నింపిన దీప్తి మహాత్మ జ్యోతిరావ్ ఫూలే. నిమ్న కులాలకు విద్యను అందించడం ద్వారా వారి జీవితాలు బాగుపడాలనే ఆశయంతో ముందుకెళ్ళి సమాజంలోని వర్ణ, కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, స్త్రీలపట్ల పురుషాధిక్య సమాజం అనుసరిస్తున్న అనాగరిక పోకడలపై అలుపెరుగని పోరాటం చేసి, సమాజంలో స్త్రీలు అభివృద్ధి చెందకపోతే ఆ సమాజం వృద్ధి చెందదని, స్త్రీలు చదువుకోవాలని అభిలషించి, తన భార్య సావిత్రిబాయి ఫూలేకి విద్యను నేర్పించి, ఆమె ద్వారా పాఠశాలలు తెరిపించి మహిళలతో పాటు నిమ్న కులాల వారికి చదువును చెప్పించిన ఆధునిక భారతదేశ తొలి సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావుఫూలే. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారతదేశానికి సర్వసంత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత మన రాజ్యాంగానిదే. వివిధ కులాల, మతాల, సంస్కృతుల, ప్రాంతాల భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది మన రాజ్యాంగ ఫలమే. ఓటు అనేది గుర్తింపు. ఆ ఓటు ద్వారా మీరు రాజులు అవుతారో ఓటుని అమ్ముకొని బానిసలు అవుతారో మీ చేతిలోనే ఆ ఓటు అనే ఆయుధాన్ని పెట్టానని తెలిపిన మహనీయులు డా॥బి.ఆర్. అంబేడ్కర్.

Browse more Telugu books