Dr. B.R. Ambedkar Smruthulu - Jnapakalu
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 180. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ - నానక్ చంద్రత్తు నానక్ చంద్ రత్తు 6 ఫిబ్రవరి 1922న పంజాబ్లోని హోషియార్పూర్లో జన్మించారు. జనవరి 1940 నుంచీ 6 డిసెంబర్ 1956 వరకూ 16 సంవత్సరాలు డా|| అంబేడ్కర్ వ్యక్తిగత కార్యదర్శిగా వున్నారు. బాబాసాహెబ్కు అత్యంత నమ్మకస్తునిగా సేవలందించి ఆయన వ్యక్తిగత అనుభవాలు, సందేశాలు, జ్ఞాపకాలను భద్రపరచి పుస్తకరూపంలో అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధునికి ఆనందుడెంత సహచరుడో, నమ్మకస్తుడో, సన్నిహితుడో.. బాబాసాహెబ్ అంబేడ్కర్కు నానక్ చంద్రత్తు అంతే. "ప్రముఖ అంబేడ్కరైట్, దళిత సామాజిక సిద్ధాంత విశ్లేషకులు జూపూడి ప్రభాకరరావు విద్యార్థి దశ నుంచీ (1978-88) ລ້, 1989-2007 కేంద్ర రక్షణ శాఖ (మిథాని), హైదరాబాద్లో వివిధ హోదాలు నిర్వహించి, దళిత ఉద్యమంలో పూర్తికాలం పనిచేసేందుకు సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007-2015 కాలంలో ఎమ్మెల్సీగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం వచ్చేందుకు కౌన్సిల్లో రెండు రోజులు దళిత సమస్యల మీద చర్చలు జరిపించారు. 2016-2019 కాలంలో ఎ.పి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా డా॥ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా “స్మృతివనం"ను ఏర్పరచేందుకు ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.