Dindukinda Nallathrachu
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 110. "చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్ళంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్క సారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను" అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. కల్యాణి చిగురుటాకులా వణికిపోయింది. "దేశమంతా ఒకే మతం ఉంటే గొడవలు ఉండవా? మరి లెబనాన్ దేశంలో హజుల్లా షియాలు సున్నీల్ని ఎందుకు ఉచకోత కోస్తున్నారు? ఆఫ్ఘనిస్థాన్లో ఆల్బైదా సున్నీలు షియాల్ని ఎందుకు చంపుతున్నారు? మన పక్క దేశం పాకిస్తాన్లో షియాలకీ, సున్నీలకీ మధ్య ఎందుకంత రక్తపాతం?" అని ఆగి, "మనిషి సుఖంగా బ్రతకటానికి కావల్సింది మతం కాదురా. మానవత్వం" అన్నాడు. "మానవత్వం అన్నం పెట్టదు" "అమెరికాలో అన్నం ఉంటుంది. తినటానికి టైమ్ ఉండదు. సొమాలియాలో టైమ్ ఉంది. తినటానికి అన్నం ఉండదు. ఆఫ్ఘన్లో మతం ఉంది. అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకురా ఇలా పాడు చేస్తున్నారు?"