Dheshee Dhisha
Editor · Caste, Religion & Culture

Price: Rs. 135. * ఈ భూమ్మీద ఉన్న జీవుల్లో మనిషి తప్ప అన్ని జీవులూ భౌతిక వాస్తవికత మీద బ్రతికేవే! మనిషి ఒక్కడే భౌతిక జీవితాన్ని సుఖంగా కొనసాగిస్తూనే... భావవాద ప్రపంచంలోకి పోయి దుఃఖాలు కొని తెచ్చుకుంటాడు. కాబట్టి భావవాదం అనేది మనిషి పరిణామంతోపాటు వెంట తెచ్చుకున్న ఒక అవలక్షణం. * రాజకీయ ఎజెండా యొక్క కేంద్ర బిందువుగా మనం తీసుకురావలసిన విషయమేమిటంటే, సామాజికంగా పరిణామం చెందని, స్వేఛ్ఛా, సమానత్వాలు కలిగి ఉండని, కనీసం వాటికి అనుకూల పరిస్థితులు కల్పించని ఒక సమాజాన్ని జాతి అని ఏ రకంగా పిలవగలం? కొంత సామాజిక పరివర్తన భారతదేశంలో కలగాలన్నా స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన జాతిగా అవతరించాలన్నా కులనిర్మూలన, బ్రాహ్మణీయ అధిపత్య భావజాల విధ్వంసం అనేవి ముందస్తు షరతులుగానే ఉంటాయి. కాబట్టి కుల వ్యతిరేక దృక్పధంతో చూసినప్పుడు కులనిర్మూలన జరగకుండా ఒక జాతిని సృష్టించటం సాధ్యం కాదు. * హిందూత్వ ఫాసిజం ఏకైక లక్ష్యం ఈ సమాజంలో గత 200 సంవత్సరాలుగా బలం పుంజుకుంటూ వస్తున్న ఆధునిక నాగరిక తలాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే. ఒకసారి అది పూర్తిగా ధ్వంసం అయిపోతే ... రాజ్యాంగాన్ని, చట్టాలనూ, సంస్థలనూ వేటినీ మార్చకుండానే ఈ సమాజమంతా ఏ ప్రతిఘటనా లేకుండా ఫాసిజానికి లొంగిపోతుంది. అందువల్ల ఈ సమాజంలో ఫాసిజం సృష్టించిన ఈ సంక్షోభాన్ని ప్రతిఘటించడానికీ, నిలవరించి కూల్చివేయడానికి ప్రగతిశీల శక్తులు ధరించవలసిన ఏకైక ఆయుధం ఆధునికత.