Dharuvula Bhandi
Editor · Novels

Price: Rs. 70. జనంలో జానపదం పదిలంగా నాడు వుండింది. నేడు వున్నది. రేపు వుంటుంది. జానపదాన్ని ఇతరులకు పంచి పెంచుకోవాలన్నది నా కోరిక. నా కోర్కె తీర్చుకునేందుకు ప్రజానాట్యమండలి అనే పాటల బాటలో జానపద కళల బండి మీద ప్రయాణం చేస్తున్నాను. “దరువుల బండి"ని తయారుచేసి దారిలో పెడుతున్నాను. దారి తప్పకుండ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. - బండి సత్తెన్న బండి సత్తెన్న ఒక సాధారణ మనిషిలా తనలోంచి తన చుట్టూ వున్న సమాజాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. తన వర్గం, కులం, ఊరు, ప్రాంతం, అనుభవం లాంటి అన్నింటిని మిళితం చేసి ఒక ప్రాతినిధ్య పాళీగా మారాడు. అదీ నిజాయితీగా. ఎలాంటి ప్లాస్టిక్ రంగుల కృత్రిమతలు లేకుండా నికాలస్ (నిజాయితి)గా వినిపించాడు. ఇందులో ఇతివృత్తాన్ని బట్టి పాట లోతు ఉన్నది. కవితా వస్తువు కాని అంశాలపై కూడా పాటలు రాశాడు. ఇక్కడ కవిత్వీకరించడం ప్రాధాన్యత కాదు. విషయం, వస్తువుని ప్రజలకు తెలియజేయడమే ముఖ్యం. - జయధీర్ తిరుమలరావు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ప్రజల సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని ప్రజా నాట్యమండలి చేస్తున్న పోరాటం బండి సత్తెన్న లాంటి వాగ్గేయకారుల రూపంలో నూరు పూలుగా వికసించాలి. వేయి ఆలోచనలుగా సంఘర్షించాలి. చక్కనిపాట, ముచ్చటైన పద్యం, అందమైన గద్యం, వాయిద్యం మీదపట్టు, సామ్యవాదం మీద నమ్మకంగా సాగిన ఈ కళాజాతాల కదంబం నేటి అవసరమే కాదు. భావి తరాలకు మేటి మహా నాటకం కూడా. - డాక్టర్ బెల్లి యాదయ్య